తదుపరి వార్తా కథనం
Nepal Border: వీసా, పాస్‌పోర్ట్ లేకుండా భారత్‌లోకి రావడానికి ప్రయత్నం.. చైనా మహిళ అరెస్టు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 10, 2026
10:13 am
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఉన్న ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న చైనా మహిళను సశస్త్ర సీమాబల్ (SSB) సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తన వద్ద చెల్లుబాటు అయ్యే వీసా, పాస్‌పోర్ట్ వంటి అవసరమైన ప్రయాణ పత్రాలు లేకపోవడంతో ఆమెను స్థానిక పోలీసులకు అప్పగించారు.
Details
పోలీసుల అదుపులో మహిళ
ఆమె వద్ద లభించిన ఒక స్లిప్ ఆధారంగా ఆ మహిళను చైనాకు చెందిన హువాజియా జీగా గుర్తించినట్లు నౌతన్వా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తెలిపారు. ఈ మహిళ భారత్‌కు ఏ ఉద్దేశంతో వచ్చిందన్న అంశంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను అదుపులో ఉంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.