ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో పరీక్ష కేంద్రాల వల్ల సందడి నెలకొంది. ఈ ఏడాది నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా 11పేపర్లతో నిర్వహించే పరీక్షను 6 పేపర్లతో నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో 2,49,747 మంది బాలురు, 2,44,873 మంది బాలికలు సహా మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 2,652 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. ఉదయం 9.30గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది.
పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు.
పరీక్షలను పర్యవేక్షించేందుకు పాఠశాల విద్యాశాఖ 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించింది. ఏప్రిల్ 13న పరీక్షలు ముగియనున్నాయి.
10వ తరగతి
ఏపీలో విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఆంధ్రప్రదేశ్‌లో 6,09,070 మంది రెగ్యులర్ అభ్యర్థులతో సహా 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.
ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానందరెడ్డి మాట్లాడుతూ అన్ని కేంద్రాల్లో ఫర్నీచర్, నీటి వసతి వంటి సౌకర్యాలు కల్పించామన్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.