Kumbh Mela Stampede: తొక్కిసలాట తర్వాత కుంభమేళాలో మార్పులు.. ఫిబ్రవరి 4 వరకు వాహనాలకు నో ఎంట్రీ, VVIP పాస్‌లు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
మౌని అమావాస్య సందర్భంగా ఏర్పడిన భారీ రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
కుంభమేళా నిర్వహణలో కొన్ని కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యంగా, వీవీఐపీ పాస్‌లను పూర్తిగా రద్దు చేసింది.
వివరాలు
కుంభమేళాలో కీలక మార్పులివే..
భక్తుల రద్దీ నియంత్రణ కోసం మహా కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ ప్రాంతాన్ని 'నో వెహికల్ జోన్'గా ప్రకటించింది.
వాహన ప్రవేశంపై ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టంగా ప్రకటించింది. వీవీఐపీ, స్పెషల్ పాస్‌లను పూర్తిగా రద్దు చేసింది.
ప్రయాగ్‌రాజ్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపివేస్తామని తెలిపింది. రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్ నగరంలోకి ఫోర్ వీలర్ వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించింది.
భక్తుల సౌకర్యార్థం కుంభమేళా ప్రాంగణంలో వన్-వే ట్రాఫిక్ వ్యవస్థను అమలు చేయనుంది.
వివరాలు
కుంభమేళాలో కీలక మార్పులివే..
చిన్న వ్యాపారులు రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయకుండా, ఖాళీ ప్రదేశాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూడాలని సూచించింది.
మేళా ప్రాంగణంలో భద్రతను పెంచేందుకు పెట్రోలింగ్‌ను మరింత కఠినతరం చేయాలని పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.