
శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని బహుదా నదిపై నిర్మించిన పురాతన వంతెన బుధవారం కుప్పకూలింది.
70టన్నుల గ్రానైట్ లోడ్ లారీతో పాటు మరో లారీతో వంతెనపై వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
దీంతో వంతెనపై ఉన్న వాహనాలు నదిలోకి పడిపోయాయి. అదృష్టవశాత్తూ, లారీ డ్రైవర్‌తో పాటు కొంతమందికి గాయాలు మాత్రమే అయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
వంతెనకు నదికి మధ్య 20 మీటర్ల దూరం మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.
వంతెన
1929లో వంతెన నిర్మాణం
రామచంద్ర రాజా వంతెన పేరుతో బ్రిటీష్ వారు నిర్మించారు. మద్రాసు గవర్నర్ ఫిబ్రవరి 3, 1929న దీనిని ప్రారంభించారు.
గ్రానైట్ లోడులతో లారీలు ప్రతిరోజూ ఇచ్ఛాపురం పట్టణం నుంచి జాతీయ రహదారి మధ్య ఉన్న వంతెన మీదుగా వెళుతుంటాయి.
బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని, సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు.
సాధారణంగా గ్రానైట్ లారీలు జాతీయ రహదారి గుండా వెళుతుంటాయి. అయితే ఈ వంతెనపై నుంచి కొన్ని లారీలు వెళుతున్న క్రమంలో బరువును తట్టుకోలేక కుప్పకూలినట్లు స్థానికులు చెప్పారు.
వంతెన కూలిపోవడంతో ఇచ్ఛాపురం పట్టణంలోకి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.