దేశంలో కొత్తగా 1,580 మందికి కరోనా; 17 మంది మృతి
దేశంలో గత 24గంటల్లో 1,580 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే గురువారంతో పోలిస్తే శుక్రవారం కొత్త కేసులు కొంచెం తగ్గినట్లు కేంద్రం పేర్కొంది. తాజా కేసులతో కలుపుకొని దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,009కు చేరుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా దేశంలో కోవిడ్‌తో కొత్తగా 17మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 5,31,753కు చేరుకుంది. ఇటీవల కాలంలో కరోనా వేరియంట్ ఆర్క్టురస్ ఎక్కువగా వ్యాపించిందని, అయితే ఇప్పుడు తగ్గిందని కేంద్రం చెప్పింది. కరోనా నుంచి 4.4 కోట్ల మందికి పైగా ప్రజలు కోలుకున్నట్లు పేర్కొంది. దేశంలో రికవరీ రేటు 98.77% వద్ద నమోదైంది