Cyclone Murasu: మురసు తుఫాను ప్రభావం.. విజయవాడలో 12 విమాన సర్వీసులు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
మురసు తుఫాను ప్రభావంతో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేడు రాకపోకలు సాగించాల్సిన 12 విమాన సర్వీసులను రద్దు చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇండిగోకు చెందిన 10, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 2 సర్వీసులను నిలిపివేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. రద్దయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఐఎక్స్ 2413/2414 విమానం విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా తిరిగి విశాఖపట్నం వెళ్లాల్సి ఉంది. అలాగే ఐఎక్స్ 2405/2406 విమానం హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా, ఈ రెండు సర్వీసులను రద్దు చేశారు.
వివరాలు
రద్దయిన ఇండిగో విమానాలు
ఇండిగోకు చెందిన పది విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
1. 6E 7730/6E 7304: విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లాల్సిన విమానం. విజయవాడకు చేరుకునే సమయం మధ్యాహ్నం 12.10 గంటలు కాగా, బయలుదేరే సమయం 12.30 గంటలు.
2. 6E 7215/6E 7708: బెంగళూరు నుంచి విజయవాడ మీదుగా తిరుపతి వెళ్లాల్సిన విమానం. రాక సమయం మధ్యాహ్నం 12.45 గంటలు, బయలుదేరే సమయం 1.05 గంటలు.
3. 6E 6263/6E 6327: హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం. రాక సమయం మధ్యాహ్నం 1.15 గంటలు, బయలుదేరే సమయం 1.45 గంటలు.
వివరాలు
రద్దయిన ఇండిగో విమానాలు
4. 6E 7707/6E 7216: తిరుపతి నుంచి విజయవాడ మీదుగా బెంగళూరు వెళ్లాల్సిన విమానం. రాక సమయం మధ్యాహ్నం 3.45 గంటలు, బయలుదేరే సమయం 4.05 గంటలు.
5. 6E 7305/6E 7305: చెన్నై నుంచి విజయవాడ మీదుగా కోయంబత్తూరు వెళ్లాల్సిన విమానం. రాక సమయం సాయంత్రం 4.05 గంటలు,బయలుదేరే సమయం 4.25 గంటలు.
6. 6E 7223/6E 7224: బెంగళూరు నుంచి విజయవాడ మీదుగా తిరిగి బెంగళూరు వెళ్లాల్సిన విమానం. రాక సమయం సాయంత్రం 5.25 గంటలు,బయలుదేరే సమయం 5.45 గంటలు.
7. 6E 2580/6E 2581: హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం. రాక సమయం సాయంత్రం 6.35 గంటలు, బయలుదేరే సమయం 7.10 గంటలు.
వివరాలు
రద్దయిన ఇండిగో విమానాలు
8. 6E 7306/6E 7306:కోయంబత్తూరు నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లాల్సిన విమానం.రాక సమయం సాయంత్రం 7.05 గంటలు,బయలుదేరే సమయం 7.25 గంటలు.
9. 6E 5158/6E 5127:ముంబై నుంచి విజయవాడ మీదుగా తిరిగి ముంబై వెళ్లాల్సిన విమానం.రాక సమయం సాయంత్రం 7.30 గంటలు,బయలుదేరే సమయం రాత్రి 8 గంటలు.
10. 6E 7247/6E 7246:బెంగళూరు నుంచి విజయవాడ మీదుగా తిరిగి బెంగళూరు వెళ్లాల్సిన విమానం. రాక సమయం రాత్రి 8.35 గంటలు,బయలుదేరే సమయం 8.55 గంటలు.
తుఫాను ప్రభావంతో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించి తమ విమానాల వేళలు,సర్వీసుల స్థితిని నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు.