
Dadi Veerabhadra Rao: వైసీపీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి బిగ్ షాక్ తగిలిగింది.
మాజీమంత్రి దాడి వీరభద్రరావు ఫ్యామిలీ వైసీపీకి గుడ్ బై చెప్పింది.
సీఎం జగన్‌కు తన రాజీనామా లేఖను దాడి వీరభద్రరావు పంపారు.
తన అనుచరులతో కలిసి తాను పార్టీ వీడుతున్నట్టు ఏకవాక్యంతో రాజీనామా వీరభద్రరావు చేశారు.
రాజీనామాకు ముందు వీరభద్రరావు తన వర్గీయులతో అనకాపల్లిలో సమావేశమయ్యారు.
తాను వైసీపీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరుతున్నట్లు దాడి వీరభద్రరావు ప్రకటించారు.
టిడిపిలో రేపు చేరుతానని వెల్లడించారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ సీనియర్ నేతగా దాడి వీరభద్రరావు గుర్తింపు పొందారు. టీడీపీ తరఫున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
వైసీపీ
రెండోసారి వైసీపీని వీడిన దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల ముందు దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు.
ఆ తర్వాత జగన్‌పై విమర్శలు చేసి పార్టీని వీడారు. అనంతరం 2019 ఎన్నికల ముందు మరోసారి వైసీపీలో చేరారు.
అయితే వైసీపీ తరుపున గెలిచినా.. వీరభద్రరావును జగన్ పట్టించుకోలేదు. దీంతో ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు.
చివరికి మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దాడి వీరభద్రరావు వైసీపీ వీడారు.
1985లో ఎన్టీఆర్ పిలుపు మేరకు వీరభద్రరావు రాజకీయ అరంగేట్రం చేశారు.
అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989, 1994, 1999లలోను గెలిచి.. అనకాపల్లి రాజకీయాలను శాసించారు.