Rahul Bojja: శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి డిండి ఎత్తిపోతల నీటి మళ్లింపు... రూ.1,800 కోట్లతో అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుండి డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని మళ్లించే పనికి నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతిని జారీ చేసింది.
రూ.1,800 కోట్ల వ్యయంతో ఈ పనులను చేపట్టేందుకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
30 టీఎంసీ నీటిని వినియోగించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడుతోంది.
దిగువన ప్రధాన కాలువ, రిజర్వాయర్ల నిర్మాణం కొనసాగుతున్నా,శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుండి ఎక్కడి నుంచి నీటిని మళ్లించాలో అనేది చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది.
వివరాలు
ఎత్తిపోతల పథకానికి అర టీఎంసీ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించు ఏదుల రిజర్వాయర్ నుండి డిండి కి నీటిని మళ్లించే పనికి ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
శ్రీశైలం నుండి రోజుకు రెండు టీఎంసీ నీటిని ఎత్తిపోసి, అందులో అర టీఎంసీ నీటిని డిండి ఎత్తిపోతల పథకానికి మళ్లిస్తారు.