Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగులో మాట్లాడని వారికి ఓటు వేయకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని ఆయన సూచించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న రెండోవ ప్రపంచ మహాసభల్లో ఆయన మాట్లాడారు.
తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆయన గుర్తు చేశారు.
తెలుగు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినదే కాకుండా మన భారతీయ ఆత్మ గౌరవానికి ప్రతీక ఆయన స్పష్టం చేశారు.
ప్రాథమిక విద్యను మాతృభాషలోనే నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.
Details
తెలుగు భాషపై గౌరవం పెంచుకోవాలి
అలాగే, సినిమా సంభాషణలు కూడా తెలుగులోనే ఉండాలని సూచించారు. ఆంగ్లంలో మాట్లాడకపోతే నామోషీ అన్న భావన పూర్తిగా తప్పు అని ఆయన చెప్పారు.
తెలుగు భాషను అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని, అమ్మ భాషను మరిచిపోతే అది అమ్మను మరిచిపోయినట్టేనని తెలిపారు. ఇంగ్లిష్ భాషను ఉపయోగించే క్రమంలో తెలుగును దిగజార్చడం మంచి పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చి నివసించే ప్రజలు తెలుగులో మాట్లాడుతున్నారని, మన భాషను మనమే పట్టించుకోవడంలో వెనుకబడి పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మన భాషపై గౌరవం ఉంచుకోవడం మన బాధ్యత" అని ఆయన వ్యాఖ్యనించారు.