Page Loader
Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్ 
అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్

Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్ 

వ్రాసిన వారు Stalin
Jul 12, 2023
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంబులెన్స్ డ్రైవర్లు సైరన్‌లు వాడే సమయంలో బాధ్యతగా వహించాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అంజనీ కుమార్ కోరారు. అంబులెన్స్ సైరన్‌లను దుర్వినియోగం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. సైరన్‌ను దుర్వినియోగం చేసిన అంబులెన్స్ డ్రైవర్‌ను పోలీసు ప్రశ్నిస్తున్న వీడియోను ట్విట్టర్‌లో డీజీపీ షేర్ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడే అంబులెన్స్ సైరన్‌లను ఉపయోగించాలని డ్రైవర్‌లను కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా, సురక్షితమైన మార్గం కోసం సైరన్‌లను యాక్టివేట్ చేయడం అవసరమన్నారు. బషీర్‌బాగ్ సమీపంలో సోమవారం రాత్రి 8 గంటలకు ఈ ఘటన జరిగినట్లు విచారణలో తేలింది.

అంబులెన్స్

డ్రైవర్‌పై చర్యలు తీసుకున్న పోలీసులు

అంబులెన్స్ డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నట్లు నారాయణగూడ ట్రాఫిక్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్.వెంకన్న తెలిపారు. నిబంధనల ప్రకారం మెడికల్ ఎమర్జెన్సీ లేనప్పుడు సైరన్‌ను ఆఫ్ చేయాలని ఇటీవల పోలీసులు పదే పదే చెబుతున్నారు. అంతకుముందు అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో ఉంటడంతో రూట్ క్లియర్ చేసి, డ్యూటీ అధికారి దారిచ్చారు. ఆ అంబులెన్స్ కొంత దూరం వెళ్లాక, ట్రాఫిక్ డ్యూటీ అధికారికి రోడ్డు పక్కన ఆగి ఉండడం కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా, అందులో డ్రైవర్, నర్సు లేరు. అప్పుడే డ్రైవర్‌ కూల్‌ డ్రింక్‌ కొనుక్కొని వస్తూ కనిపించారు. ఈ క్రమంలో డ్రైవర్‌పై ట్రాఫిక్ డ్యూటీ అధికారి సీరయస్ అయ్యారు. మిర్చి బజ్జీ తినడానికా మీకు దారిచ్చిందని ప్రశ్నించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డీజీపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో