
Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు అనూహ్యంగా వివాదానికి దారి తీసాయి.
చేవెళ్లకు చెందిన త్రిపుర రిసార్టులో జరిగిన ఈ బర్త్‌డే పార్టీ సందర్భంగా పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో భారీగా గంజాయి, విదేశీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.
అంతేకాక, పార్టీలో పాల్గొన్న కొంతమందికి నిర్వహించిన వైద్య పరీక్షలలో డ్రగ్స్ వాడకానికి సంబంధించిన నివేదికలు పాజిటివ్‌గా రావడంతో మరింత ఉద్రిక్తత ఏర్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మండల పరిధిలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి మంగ్లీ పుట్టినరోజు వేడుకలు జరగాయి.
ఈ పార్టీకి సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు,అలాగే పెద్ద సంఖ్యలో యువత హాజరైనట్లు సమాచారం.
వివరాలు
భారీగా గంజాయితో పాటు వివిధ రకాల విదేశీ మద్యం
అయితే ఈ వేడుకల్లో మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నదన్న సమాచారాన్ని పోలీసులు అందుకున్నారు.
ఈ నేపథ్యంలో రిసార్టుపై ఆకస్మికంగా సోదాలు నిర్వహించిన పోలీసులు, అక్కడ భారీగా గంజాయితో పాటు వివిధ రకాల విదేశీ మద్యం సీసాలను పట్టుకున్నారు.
పార్టీలో పాల్గొన్న కొంతమందిని అదుపులోకి తీసుకుని డ్రగ్ టెస్టులు నిర్వహించగా, వాటిలో కొన్ని నమూనాల్లో డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.
ఈ డ్రగ్స్ వాడిన వారిలో కొంతమంది ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ఘటనపై కేసు నమోదు
ఈ పరిణామాల నేపథ్యంలో సినీ వర్గాల్లో, ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై మరోసారి ఆందోళన వెలిబుచ్చుతోంది.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
పార్టీని నిర్వహించిన నిర్వాహకుల పాత్రపై కూడా ప్రత్యేక దృష్టిసారించారు.
డ్రగ్స్ సరఫరాకు సంబంధించి వెనుక ఉన్న అసలు ముఠాను గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీపై పోలీసుల దాడి
హైదరాబాద్‌లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీపై పోలీసుల దాడి.. పలువురికి గంజాయి పాజిటివ్
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025
పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్
చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో బర్త్ డే పార్టీపై పోలీసుల దాడులు, విదేశీ మద్యం సీజ్
పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన… https://t.co/nOQ1MJGNgc pic.twitter.com/rCPHVjFb7f