Durgam Chinnaiah : పోలింగ్ వేళ దుర్గం చిన్నయ్య పై కేసు.. కారణం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు దుర్గం చిన్నయ్యపై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు.
గురువారం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలోకి బీఆర్ఎస్ పార్టీ కండువాతో చొచ్చుకెళ్లారు.
అధికార పార్టీ అభ్యర్థిగా గులాబీ కండువా కప్పుకుని పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు. దీంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ వోజ్జల రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ అయ్యింది.
మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి(MCC)ని ఉల్లంఘించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యేపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సహా ఇతర పార్టీల అభ్యర్థులు, నేతలు డిమాండ్ చేస్తున్నారు.
details
చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్, బీజేపీ డిమాండ్
దుర్గం చిన్నయ్య, నెన్నెల మండలం జెండా వెంకటాపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ మేరకు ఓటు వేసేందుకు వచ్చిన ఆయన గులాబీ పార్టీ కండువా కప్పుకునే పోలింగ్ బూత్'లోపలికి వచ్చేశారు.
ఇదే సమయంలో పార్టీ కండువాతో ఓటు వేసిన చిన్నయ్య నడవడిక జిల్లాలో దుమారం రేపుతోంది. ఒక దశలో ఎన్నికల సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతోనే ఆయన పార్టీ కండువాతోనే ఓటు వేసుకున్నారు. ఈ చర్య విమర్శలకు తావిస్తోంది.
ఈ క్రమంలోనే స్పందించిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు దుర్గం చిన్నయ్యతో పాటు పోలింగ్ బూత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.