Page Loader
TG EAPCET: ఎప్‌సెట్‌ 2024.. దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్‌ ఖరారు
ఎప్‌సెట్‌ 2024.. దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్‌ ఖరారు

TG EAPCET: ఎప్‌సెట్‌ 2024.. దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్‌ ఖరారు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2025
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌ (ఎప్‌సెట్‌) దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25 నుంచి ప్రారంభంకానుంది. సోమవారం జేఎన్‌టీయూహెచ్‌లో ఎప్‌సెట్‌తో పాటు పీజీఈసెట్‌, ఐసెట్‌ కమిటీల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు జేఎన్‌టీయూహెచ్‌ ఇన్‌ఛార్జ్‌ వైస్‌ ఛాన్సలర్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి, ఉపాధ్యక్షులు పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేశ్, ఎప్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య బి. డీన్‌కుమార్, కో-కన్వీనర్‌ ఆచార్య కె. విజయకుమార్‌రెడ్డి పాల్గొని దరఖాస్తుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

 Details

రూ.500 ఫీజు చెల్లించాలి

ఈ ఏడాది ఎప్‌సెట్‌తో సహా అన్ని ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాక అధికారులు విడుదల చేసే ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలియజేయాలంటే ఒక్కో ప్రశ్నకు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించారు. నిపుణుల కమిటీ అభ్యంతరాన్ని సమర్థించిందనుకుంటే, ఫలితాల విడుదల అనంతరం డబ్బును తిరిగి చెల్లిస్తారు. జాతీయస్థాయి పరీక్షలైన జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ వంటి పరీక్షల్లో ఇదే విధానం కొనసాగుతోంది.

Details

 పీజీఈసెట్, ఐసెట్‌ కమిటీ నిర్ణయాలు 

ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌ కమిటీ సమావేశంలో కన్వీనర్‌ ఏ. అరుణకుమారి, కో-కన్వీనర్‌ బి. రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్, కన్వీనర్‌ ఆచార్య అలువాల రవి పాల్గొని దరఖాస్తుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇప్పటివరకు అన్‌రిజర్వుడ్‌ కోటా 15శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు దాటిన నేపథ్యంలో ఈ కోటా విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నోటిఫికేషన్‌ విడుదల సమయానికి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోతే, ప్రవేశాల సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Details

దివ్యాంగుల రిజర్వేషన్‌ 

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 5శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఇప్పటివరకు మూడు కేటగిరీలు (దృష్టిలోపం, వినికిడి-మూగ, అంగవైకల్యం) ఉండగా, 3% రిజర్వేషన్‌ ఉండేది. - కొత్తగా మరో రెండు కేటగిరీలు చేర్చారు (డి) ఆటిజం వంటి మానసిక వైకల్యం. (ఇ) ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు. ప్రతి కేటగిరీకి 1శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. అయితే వారి సీట్లు సామాజిక వర్గాల రిజర్వేషన్‌లోనే కేటాయిస్తారు. ఉదాహరణకు, ఒక ఆటిజం విద్యార్థి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారయితే, ఎస్సీలకు కేటాయించిన 15శాతం రిజర్వేషన్‌లోనే సీటు పొందుతారు. ఈఏపీసెట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ, దరఖాస్తుల ప్రక్రియ, రిజర్వేషన్ విధానం, అభ్యంతరాల పరిష్కారం వంటి కీలక అంశాలను ఈ సమావేశాల్లో ఖరారు చేశారు.