Page Loader
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఈసీఐ 
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఈసీఐ

జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఈసీఐ 

వ్రాసిన వారు Stalin
Oct 09, 2023
06:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జమ్ముకశ్మీర్ ఎన్నికలను సరైన సమయంలోనే జరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, భద్రత అంశాలను పరిశీలనలోకి తీసుకొని సరైన సమయంలో ఎన్నికల నిర్వహణకు ముందుకొస్తామని సీఈసీ అన్నారు. అయితే దానికి ఇంకా సమయం రాలేదన్నారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు నిర్వహించిన మీడియాలో సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జమ్ముకశ్మీర్ ఎన్నికలపై మాట్లాడుతున్న సీఈసీ