Electricity Charges: యాక్సిస్ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్ తగలనుందా?
ఈ వార్తాకథనం ఏంటి
యాక్సిస్ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్ తగలేలా కన్పిస్తోంది.
ఈ సంస్థతో జరిగిన ఒప్పందం ప్రకారం, 25 ఏళ్ల వ్యవధిలో వినియోగదారులపై రూ.14,186.92 కోట్ల అదనపు భారమని అంచనా వేయబడుతోంది.
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (AEVIPL) సంస్థ సౌర, పవన ప్రాజెక్టుల ద్వారా 1,174.90 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలను (PPA) కుదుర్చుకోవడంలో విద్యుత్ సంస్థలు ప్రయత్నిస్తుంటే, ఆ ప్రతిపాదనలు ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (APERC)కి సమర్పించబడ్డాయి.
ఆ సంస్థ విద్యుత్ యూనిట్ టారిఫ్ ఎంత ఉండాలన్న విషయాన్ని కూడా కమిషన్‌కు ప్రతిపాదించింది, దాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ (AP PCC) కూడా కమిషన్ ఆమోదం కోసం పంపించింది.
వివరాలు
774.9 మెగావాట్ల పవన విద్యుత్ ప్రతిపాదనలు
ఈ ప్రతిపాదనకు APERC ఆమోదం ఇచ్చినట్లయితే,ప్రజలపై భారం పడనుంది.
గత ప్రభుత్వంలో యాక్సిస్‌తో కుదరిన ఒప్పందంలో యూనిట్ ధర రూ.3.30గా ప్రతిపాదించబడింది.
కానీ ఆ ప్రతిపాదన కమిషన్ తిరస్కరించడంతో ఇప్పుడు యాక్సిస్ సంస్థ ప్రతిపాదించిన యూనిట్ ధర రూ.4.28చొప్పున నిర్ణయించడంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
గతంలో కమిషన్ తిరస్కరించిన PPAలలోని 21 డ్రాఫ్ట్ PPAలను 2022 నవంబర్ 23న విద్యుత్ సంస్థలు కమిషన్‌కు పంపాయి.
400 మెగావాట్ల బండ్లింగ్ విద్యుత్ ప్రతిపాదనలపై (పవన-650.4మెగావాట్లు,సౌర-400 మెగావాట్లు) 2023 జులై 11న వివరణ కోరుతూ,కమిషన్ వాటిని తిరస్కరించింది.
774.9 మెగావాట్ల పవన విద్యుత్ ప్రతిపాదనలు 2024 ఏప్రిల్ 19న తిరస్కరించబడ్డాయి.
పీపీఏలను తిరిగి కమిషన్ ఆమోదం కోసం పంపేందుకు విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.
వివరాలు
యాక్సిస్ సంస్థ ప్రతిపాదించిన టారిఫ్‌ను ఆమోదిస్తే..
2018లో యాక్సిస్ సంస్థ 5 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ట్రిపుల్ బీ పథకం కింద ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
2019లో విద్యుత్ సంస్థలు ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చాయి, కానీ 2019 ఎన్నికల తరువాత సమీక్షలో పీపీఏలలో కొన్ని ఒప్పందాలు రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వబడినవి.
అంతేకాదు,యాక్సిస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనేక చర్చలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా యాక్సిస్ సంస్థ ప్రతిపాదించిన టారిఫ్ సుమారు రూ.4.28గా ఉండగా, బహిరంగ మార్కెట్లో కూడా దాని ధర సుమారు రూ.2.90 వరకు చేరుకోవడం గమనించాల్సిన విషయం.
ఈ యాక్సిస్ సంస్థ ప్రతిపాదించిన టారిఫ్‌ను ఆమోదిస్తే,25ఏళ్ల కాలంలో ప్రజలపై రూ.14,186.92కోట్ల అదనపు భారం పడే ప్రమాదం ఉంది.