Loading...
Rahul Gandhi: హల్ద్వానీ శుద్ధి కార్యక్రమానికి కులం రంగు.. రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు
హల్ద్వానీ శుద్ధి కార్యక్రమానికి కులం రంగు.. రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Rahul Gandhi: హల్ద్వానీ శుద్ధి కార్యక్రమానికి కులం రంగు.. రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై ఉత్తరాఖండ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. హల్ద్వానీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ నిర్వహించిన ప్రదేశంలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి కులం ఆపాదించారంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కులాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా వ్యవహరించడం, మత విశ్వాసాలను దెబ్బతీసే ఉద్దేశంతో చర్యలకు పాల్పడటం వంటి ఆరోపణలతో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనలను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

వివరాలు 

ఫిర్యాదు ఆధారంగా కేసు..

జవహర్‌నగర్‌కు చెందిన అమిత్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు రాహుల్‌ గాంధీపై ఈ కేసు నమోదైంది.

ఆయన శ్రీరామ్‌ సేన ధర్మార్థ సేవా న్యాస్‌ సభ్యుడిగా ఉన్నారు. హల్ద్వానీలో నిర్వహించిన 'శుద్ధి కార్యక్రమం, పరిశుభ్రత కార్యక్రమం'లో తాను కూడా పాల్గొన్నట్లు అమిత్‌కుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆగస్టు 29న ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు వాల్మీకి సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీశాయని ఆయన ఆరోపించారు.

వివరాలు 

కార్యక్రమంలో పాల్గొన్న వారిపై రాహుల్‌ వ్యాఖ్యలు చేశారంటూ..

హల్ద్వానీలో జరిగిన శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నవారిని అంటరానితనాన్ని పాటించే వ్యక్తులుగా, దళిత వ్యతిరేకులుగా రాహుల్‌ గాంధీ చిత్రీకరించారని అమిత్‌కుమార్‌ ఆరోపించారు.

తాను ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తినని ఆయన తెలిపారు.

అదే కార్యక్రమంలో ఎస్సీ వర్గానికి చెందిన వారితో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కూడా పాల్గొన్నారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు చెందిన కులంతో ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఖర్గే సభ తర్వాతే వివాదం..

హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో ఆగస్టు 8న మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ నిర్వహించారు.

అయితే ఆగస్టు 11న అదే ప్రాంతంలో కొందరు 'శుద్ధి యజ్ఞం' నిర్వహించారు. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

ఈ ఘటనను కాంగ్రెస్‌ దళిత వ్యతిరేక వైఖరికి ఉదాహరణగా విమర్శించింది.

మరోవైపు సభ ముగిసిన తర్వాత రామ్‌లీలా మైదానం చెత్తాచెదారంతో నిండిపోయిందని, మతపరమైన ప్రదేశంలో అభ్యంతరకర నినాదాలు కూడా చేశారని బీజేపీ ఆరోపించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టాలని రాహుల్‌ డిమాండ్‌..

ఈ వివాదంపై ఆగస్టు 29న రాహుల్‌ గాంధీ స్పందించారు. హల్ద్వానీలో శుద్ధి కార్యక్రమం నిర్వహించినందుకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాహుల్‌ గాంధీ చేసిన ఈ డిమాండ్‌కు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా మద్దతు తెలిపారు.

అయితే తాజాగా రాహుల్‌ గాంధీపైనే ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో హల్ద్వానీ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT