Andhra Pradesh: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
ఈ వార్తాకథనం ఏంటి
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో గల మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
ఈ పరిణామం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో దట్టంగా పొగ అలుముకుంది.
మంటల అంటుకోవడంవలన ఆ ప్రాంతం లోని కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించి కారణాలను విశ్లేషిస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం. మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో చెలరేగిన మంటలు.
— ChotaNews App (@ChotaNewsApp) January 21, 2025
మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది.
ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. pic.twitter.com/krEkO1YrqE