Page Loader
Fire Accident : విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు
విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు

Fire Accident : విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2023
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్నం(Visakhapatnam)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. జగదాంబకూడలి సమీపంలోని ఇండస్ ఆస్పత్రి(Indus Hospital)లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. రోగులు భయంతో బయటకి పరుగులు తీశారు. పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అస్పత్రి భవనం మొదటి ఫ్లోర్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇండస్ ఆస్పత్రి ఆవరణంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

Details

40 మంది రోగులు ఆస్పత్రికి తరలింపు

ఈ ఘటనలో సూమారు 40 మంది రోగులను బయటకి తీసుకొచ్చి వారిని అంబులెన్స్ వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సమాచారం అందుకున్న అందుకున్న పోలిస్ కమిషనర్ రవిశంకర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.