ముంబై: ప్రముఖ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శాంటా క్రూజ్ ప్రాంతంలోని గెలాక్సీ హోటల్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. గెలాక్సీ హోటల్‌లో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు హోటల్ అంతా వ్యాపించడంతో అంతా పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం కాగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. గెలాక్సీ హోటల్ భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.