Page Loader
Bidar: బీదర్‌లో దోపిడీ దొంగల బీభత్సం.. ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు పెట్టెతో నిందితులు పరార్
ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు పెట్టెతో నిందితులు పరార్

Bidar: బీదర్‌లో దోపిడీ దొంగల బీభత్సం.. ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు పెట్టెతో నిందితులు పరార్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీదర్‌లో పట్టపగలే దోపిడీ జరిగింది. శివాజీ చౌక్ వద్ద ఉన్న ఓ ఏటీఎం సెంటర్‌లో డబ్బులు పెట్టడానికి వచ్చిన వాహన సిబ్బందిపై కాల్పులు జరిగాయి. బైకుపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక సెక్యూరిటీ గార్డు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తర్వాత, దొంగలు రూ.93 లక్షల నగదుతో పారిపోయారు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఈ సంఘటన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దగ్గరలో చోటుచేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరా ఆధారాల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వాహన భద్రతా సిబ్బందిపై దోపిడీ దొంగల కాల్పులు