Harbour fire: 'ఫిషింగ్ హార్బర్' వద్దకు సీఎం జగన్ రావాలని ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగి 40కి పైగా బోట్లు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, తమకు న్యాయం చేయాలని మత్స్యకార నాయకులు ఆందోళనకు దిగారు.
అగ్నిప్రమాదం జరిగిన ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకార నాయకులు బైఠాయించారు.
బాధితులను తక్షణమే ఆదుకోవాలని.. నష్టపరిహారం ప్రకటించాలన్నారు.
సీఎం జగన్ ఘటనాస్థలికి చేరుకొని బాధితులను పరామర్శించాలన్నారు.
అలాగే సంఘటా స్థలాన్ని సీఎం పరిశీలించి న్యాయం చేయాలన్నారు. బోటుకు రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, తేల్చిచెప్పారు.
ఇదిలా ఉంటే, ఈ ప్రమాదంలో యాదృచ్చికంగా జరిగింది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కావాలనే కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు మత్స్యకారులు అనుమానిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆందోళన చేస్తున్న దృశ్యం
విశాఖ ఫిషింగ్ హార్బర్ గేట్ వద్ద భారీ ఎత్తున మత్స్యకారుల నిరసన. బోటులు దగ్ధమైన ప్రమాద స్థలానికి ముఖ్యమంత్రి జగన్ రావాలని, నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్. #AndhraPradesh #Vizag #Visakhapatnam pic.twitter.com/kNEo2rjzZX
— Vizag News Man (@VizagNewsman) November 20, 2023