Page Loader
కేరళ: అయ్యప్ప మాల ధరించిన చర్చి ఫాదర్.. సభ్యత్వాన్ని రద్దు చేసిన క్రైస్తవ సంఘం 
కేరళ: అయ్యప్ప మాల ధరించిన చర్చి ఫాదర్.. సభ్యత్వాన్ని రద్దు చేసిన క్రైస్తవ సంఘం

కేరళ: అయ్యప్ప మాల ధరించిన చర్చి ఫాదర్.. సభ్యత్వాన్ని రద్దు చేసిన క్రైస్తవ సంఘం 

వ్రాసిన వారు Stalin
Sep 11, 2023
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ తిరువనంతపురానికి చెందిన చర్చి ఫాదర్ మనోజ్ అయ్యప్పమాల ధరించారు. త్వరలో శబరిమలలోని అయ్యప్ప ఆలయ యాత్రకు సిద్దమవుతున్నారు. అయితే ఆయన శబరిమల యాత్ర కోసం తనకు జీవనోపాధి అయిన ఆంగ్లియన్ చర్చి ఆఫ్ ఇండియా అందించిన లైసెన్స్‌తో పాటు తన ఫాదర్ పోస్టును కూడా వదులుకోవాల్సి వచ్చింది. తన సోషల్ మీడియా వేదికగా మనోజ్ వెల్లడించారు. ఇతర మతాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మేరకు అయ్యప్ప మాల ధరించినట్లు మనోజ్ తెలిపారు. ఈ క్రమంలోనే క్రైస్తవ మతపరమైన నియమాలను ఉల్లంఘించినట్లు మనోజ్ పై ఆంగ్లియన్ చర్చి ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. ఆయన నుంచి రెవరెండ్ కార్డును స్వాధీనం చేసుకుంది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెటిజన్ ట్వీట్