Forest to Ramp: తుపాకులు వదిలి చేనేత చీరల్లో మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు ర్యాంప్‌పై మోడళ్లుగా మెరిశారు. ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారు.. చేనేత వస్త్రాలు ధరించి ఆత్మవిశ్వాసంతో క్యాట్‌వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. వారి కొత్త జీవన ప్రయాణం,ధైర్యం, ఆత్మవిశ్వాసానికి సభికులు ఫిదా అయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు మోడళ్లుగా పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్‌పై హొయలు పోతూ నడిచిన వారు చూపరులను ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ హాజరయ్యారు. చేనేత సంప్రదాయాన్ని, దాని వారసత్వ గొప్పతనాన్ని చాటిచెప్పిన వారిని సీఎం అభినందించారు.
వివరాలు
వైరల్‌గా ర్యాంప్‌వాక్ వీడియోలు
గతంలో ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందో తెలియని పరిస్థితుల్లో తుపాకులతో అడవుల్లో గడిపిన ఈ మహిళలు.. ఇప్పుడు అదే భయాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తున్నారు.
చేనేత దుస్తుల్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌పై అడుగులు వేస్తూ కనిపించారు.
వారి ముఖాల్లో కనిపించిన చిరునవ్వులు, నడకలో కనిపించిన ధీమా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సభికులు చప్పట్లతో వారిని అభినందించారు.
ఆయుధాలను వదిలి సమాజంలోకి తిరిగి వచ్చిన ఈ మహిళలు గౌరవప్రదమైన పునరావాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
వారి జీవితాల్లో వచ్చిన ఈ మార్పును ప్రతిబింబించేలా సాగిన ర్యాంప్‌వాక్ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గత జీవితాన్ని పక్కనపెట్టి కొత్త మార్గంలో ముందుకు సాగుతున్న వారి ప్రయాణం పలువురికి స్ఫూర్తిగా నిలిచింది.
వివరాలు
వైరల్‌గా ర్యాంప్‌వాక్ వీడియోలు
ఈ ఫ్యాషన్ షోకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మాజీ మహిళా మావోయిస్టులు ర్యాంప్‌పై నడుస్తున్న దృశ్యాలను చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటి దృశ్యాన్ని ఊహించడం కూడా కష్టంగా ఉండేదని, ఇప్పుడు వారిలో కనిపిస్తున్న మార్పు మహిళా సాధికారతకు నిదర్శనమని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
మరో నెటిజన్ స్పందిస్తూ.. వీరు ఒకప్పుడు మావోయిస్టులుగా ఉన్నారంటే నమ్మలేకపోతున్నామని పేర్కొన్నారు.
హింసాత్మక జీవితాన్ని వీడి సాధారణ సమాజంలోకి తిరిగి వచ్చిన వారికి ఇలాంటి గొప్ప అవకాశం కల్పించడం అభినందనీయమని అన్నారు.
దీంతో మాజీ మహిళా మావోయిస్టుల ర్యాంప్‌వాక్ వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్‌గా ర్యాంప్‌వాక్ వీడియోలు
#WATCH | Raipur, Chhattisgarh: Former women Naxals, who once carried weapons in the dense forests of Bastar, walked the ramp to huge applause at a National Handloom Day event in Raipur after joining the mainstream. (07.08) https://t.co/BtUfHIUsHs pic.twitter.com/ClHzGcRWp1
— ANI (@ANI) August 13, 2026