Sai Prasad: ఏపీ సీఎస్ సాయిప్రసాద్‌కు గుడ్‌న్యూస్.. మరో ఆరు నెలలు పదవీకాలం పొడిగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయిప్రసాద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DoPT) ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ఆయన 2027 మే 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్ 2026 మార్చి 1న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తొలుత ఆయన పదవీకాలాన్ని ఆరు నెలలపాటు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
వివరాలు
ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం
దీంతో ఆయన సర్వీసు 2026 నవంబర్ 30 వరకు కొనసాగనుంది.
తాజాగా మరోసారి ఆయన పదవీకాలాన్ని ఆరు నెలలపాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సాయిప్రసాద్ 2027 మే 31 వరకు సీఎస్‌గా బాధ్యతల్లో కొనసాగనున్నారు.