Loading...
Good News for AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి అన్ని డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి అన్ని డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు

Good News for AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి అన్ని డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా రంగాన్ని ఎలక్ట్రిక్ బస్సుల వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ పరిణామాలతో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీలోనూ విద్యుత్ బస్సుల సంఖ్యను భారీగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

వివరాలు 

డిసెంబర్ నాటికి అన్ని డిపోల్లో సేవలు

రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సుల సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఛైర్మన్ కొనకొండ్ల నారాయణరావు తెలిపారు.

అనంతపురం ఆర్టీసీ డిపోలో బస్సుల రాక కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

భవిష్యత్‌లో ప్రతి డిపోలోనూ ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని నారాయణరావు వెల్లడించారు.

అనంతపురంలో డిసెంబర్ నాటికి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని చెప్పారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్టోబర్ చివరి నాటికే ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

వివరాలు 

మొత్తం 1,050 బస్సులు

రాష్ట్రానికి మొత్తం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఛైర్మన్ పేర్కొన్నారు. వీటిలో 350 బస్సులను అక్టోబర్ చివరి నాటికే ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రవాణా సమస్యలకు ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కొంత పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రూ.3 వేల కోట్ల భారం ఉన్నా స్త్రీ శక్తి కొనసాగింపు

స్త్రీ శక్తి పథకం కారణంగా ప్రభుత్వంపై రూ.3 వేల కోట్లకు పైగా అదనపు భారం పడుతున్నప్పటికీ, ఎక్కడా వెనుకడుగు వేయకుండా పథకాన్ని కొనసాగిస్తున్నామని నారాయణరావు తెలిపారు.

పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

దశలవారీగా 5,500 ఎలక్ట్రిక్ బస్సులు

రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా మొత్తం 5,500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద ఏపీకి 750 బస్సులు కేటాయించారు.

ఇందులో 300 బస్సులను ఇప్పటికే జులైలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

తొలి దశలో విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, అమరావతి, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం వంటి ప్రధాన నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు.

డిసెంబర్ నాటికి మొత్తం 1,050 బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఆ తర్వాత మిగిలిన బస్సులను కూడా దశలవారీగా ప్రవేశపెట్టేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

ADVERTISEMENT