LRS: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. 10 రోజుల్లోనే సమస్య పరిష్కారం!
ఈ వార్తాకథనం ఏంటి
అనుమతిలేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌ఎండీఏ శుభవార్త చెప్పింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది.
రుసుము చెల్లించిన దరఖాస్తులను కేవలం 10 రోజుల్లోనే ప్రాసెస్ చేస్తామని స్పష్టం చేసింది.
క్రమబద్ధీకరణ ఫీజు, ప్రో-రేటా ఓపెన్ స్పేస్ రుసుమును మార్చి 31లోగా చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని తెలిపింది.
ఈ డిస్కౌంట్ పొందాలనుకునే అర్హులు గడువులోగా అప్లై చేసుకోవాలని హెచ్చరించింది.
Details
10శాతం మినహాయింపు
తమ అప్లికేషన్ ఏదైనా కారణాల వల్ల తిరస్కరిస్తే, ప్రాసెసింగ్ చార్జీల కింద 10 శాతం మినహాయించి మిగతా 90 శాతం మొత్తం తిరిగి చెల్లిస్తామని హెచ్‌ఎండీఏ పేర్కొంది.
నిషేధిత జాబితాలో లేని భూములతో పాటు, చెరువులు, కుంటలు మొదలైన వాటికి 200 మీటర్ల దూరంలో లేని ప్లాట్ల అప్లికేషన్లకు ఫీజు సంబంధిత వివరాలు స్వయంచాలకంగా అందుబాటులోకి వస్తాయి.
ఇలాంటి దరఖాస్తులు రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు పంపుతారు. ఓపెన్ స్పేస్ రుసుము చెల్లించకుండానే ఎల్‌ఆర్‌ఎస్‌కు అప్లై చేసుకోవచ్చు.
క్రమబద్ధీకరణ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ తరహా అప్లికేషన్లకు రాయితీ వర్తించదు.
భవన నిర్మాణ సమయంలో ప్రో-రేటా ఓపెన్ స్పేస్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
Details
ఎల్‌ఆర్‌ఎస్ స్టేటస్ తెలుసుకునే విధానం
1. ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్ ఓపెన్ చేయాలి.
2. సిటిజన్ లాగిన్ కింద మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
3. వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి.
4. మీ అప్లికేషన్ స్టేటస్ పేజీలో కనిపిస్తుంది.
5. దరఖాస్తు తిరస్కస్తే కారణాలు చూపిస్తాయి.
6. రిజెక్ట్ కాలేని దరఖాస్తులైతే పోర్టల్‌లో ఫీజు చెల్లించాలి.
7. క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు కలిపి చెల్లిస్తే 25శాతం డిస్కౌంట్ లభిస్తుంది.