Page Loader
Hamas Cryptocurrency: దిల్లీలో దొంగిలించిన క్రిప్టోకరెన్సీ.. హమాస్ లీడర్ల ఖాతాల్లోకి బదిలీ 
దిల్లీలో దొంగిలించిన క్రిప్టోకరెన్సీ.. హమాస్ లీడర్ల ఖాతాల్లోకి బదిలీ

Hamas Cryptocurrency: దిల్లీలో దొంగిలించిన క్రిప్టోకరెన్సీ.. హమాస్ లీడర్ల ఖాతాల్లోకి బదిలీ 

వ్రాసిన వారు Stalin
Oct 11, 2023
07:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రిప్టోకరెన్సీ ద్వారా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు భారత్‌ నుంచి డబ్బు చేరిందా? 2022లో దిల్లీలో వెలుగు చూసిన క్రిప్టో కరెన్సీ కేసుకు హమాస్ ఉగ్రవాదులకు లింకు ఉందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించిన విషయాలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. క్రిప్టోకరెన్సీ ద్వారా హమాస్‌ డబ్బును సేకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. దీంతో 2022నాటి దిల్లీ క్రిప్టోకరెన్సీ కేసును.. హమాస్‌కు కలిపి చూస్తే.. ఈ రెండికి లింకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2022లో జరిగిన క్రిప్టోకరెన్సీ చోరీ కేసు దర్యాప్తులో దిల్లీకి చెందిన ఓ వ్యక్తి పర్సులోంచి దొంగిలించిన క్రిప్టోకరెన్సీని హమాస్ ఉగ్రవాదుల ఖాతాల్లోకి పంపినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

దిల్లీ

క్రిప్టోకరెన్సీ రూపంలో విరాళాలు సేకరించిన హమాస్

కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తి వాలెట్ నుంచి రూ. 30 లక్షల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగిలించారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సైబర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఆ క్రిప్టోకరెన్సీని హమాస్‌కు చెందిన మిలిటరీ విభాగం అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ రూపొందించిన వాలెట్‌కు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. క్రిప్టోకరెన్సీలో ఎక్కువ భాగం ఈజిప్ట్‌లోని అహ్మద్ మర్జూక్, పాలస్తీనాకు చెందిన అహ్మద్ క్యూహెచ్ సఫీ ఖాతాలకు బదిలీ చేయబడింది. క్రిప్టోకరెన్సీని తమ ఖాతాల్లో జమ చేయాలని సోషల్ నెట్‌వర్క్‌లలో నిధుల సేకరణ కోసం హమాస్ ప్రచారాన్ని ప్రారంభించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. క్రిప్టో ఎక్స్ఛేంజీల సహాయంతో హమాస్‌కు చెందిన అనేక క్రిప్టోకరెన్సీ ఖాతాలను స్తంభింపజేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.