LOADING...
Hanumakonda: హనుమకొండ మహిళకు యూకేలో అరుదైన గౌరవం.. క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా హేమ
హనుమకొండ మహిళకు యూకేలో అరుదైన గౌరవం.. క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా హేమ

Hanumakonda: హనుమకొండ మహిళకు యూకేలో అరుదైన గౌరవం.. క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా హేమ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

హనుమకొండకు చెందిన ప్రవాస భారతీయురాలు హేమ ఎల్లాప్రగడ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. యూకేలోని వార్విక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌కు 2023లో గ్రీన్ పార్టీ తరఫున ఎన్నికైన ఆమె, తాజాగా క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా ఎంపికయ్యారు. యూకేలో స్థానిక పట్టణాల పరిపాలనను నిర్వహించేందుకు డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కీలకంగా పనిచేస్తాయి. ఈ కౌన్సిల్‌లో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ నాయకుడిని 'లీడర్ ఆఫ్ ది కౌన్సిల్'గా నియమిస్తారు. అనంతరం కౌన్సిల్ సభ్యుల్లో కొందరిని ఎంపిక చేసి క్యాబినెట్ మెంబర్లుగా బాధ్యతలు అప్పగిస్తారు. ఈ క్రమంలో హేమ ఎల్లాప్రగడకు డీకార్బనైజేషన్ విభాగం బాధ్యతలు అప్పగించడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ఈ విభాగంలో ఆమె పాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement