Page Loader
ట్రాఫిక్ నియంత్రణకు ఓఆర్ఆర్ చుట్టూ లింకురోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలు
ట్రాఫిక్ నియంత్రణకు ఓఆర్ఆర్ చుట్టూ లింకురోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలు

ట్రాఫిక్ నియంత్రణకు ఓఆర్ఆర్ చుట్టూ లింకురోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలు

వ్రాసిన వారు Stalin
Jun 22, 2023
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ మహానగరం ఏడాదికేడాది వేగంగా విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు దాటి నలువైపులా పెరుగుతోంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులను అదిగమించేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్‌‌లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు రోడ్లను విస్తరిస్తోంది. ముఖ్యంగా సిటీలో వంతెన నిర్మాణం ద్వారా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తోంది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఇంటర్ ఛేంజ్‌లు, లింకు రోడ్లను నిర్మించేదుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 19 ఇంటర్ ఛేంజ్‌లు ఉండగ, మరో మూడు నిర్మాణంలో ఉన్నాయి.

రోడ్డు

కోకాపేటలో వంద అడుగుల వెడల్పుతో లింకు రోడ్ల నిర్మాణం

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ భారీగా భూమి అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు లింక రోడ్ల నిర్మాణంపై కూడా హెచ్‌ఎండీఏ దృషి సారిస్తోంది. ప్రస్తుతం ఓఆర్ఆర్ చుట్టూ 70వేల ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భావిష్యత్‍‌‌లో రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రధానంగా నియో పోలీస్ లే అవుట్ ఔటర్ రింగ్ రోడ్డుకు 6చోట్ల, శంకర్‌పల్లి ప్రధాన రహదారికి 4చోట్ల లింకు రోడ్లను నిర్మించనున్నారు. కోకాపేట వద్ద దాదాపు 529 ఎకరాల్లో భారీ లేఅవుట్‌ను హెచ్‌ఎండీఏ సిద్ధం చేస్తోంది. ఈ ప్రాంతంలో రోడ్ల అనుసంధానం కోసం వంద అడుగుల వెడల్పుతో లింకురోడ్లను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధం అవుతోంది.