
Modi Lakshadweep: మోదీ సందర్శన తర్వాత లక్షద్వీప్ కు పెరిగిన పర్యాటకుల తాకిడి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షదీవులు సందర్శించిన తర్వాత ఆ ప్రాంతానికి భారీగా పర్యాటకులు పెరిగారు.
ఈ మేరకు అక్కడి పర్యాటక శాఖ అధికారి ఇంతియాజ్ మహ్మద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రధాని నరేంద్రమోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడకు సందర్శించేందుకు ప్యాకేజీల కోసం ఆన్లైన్ ద్వారా తమను సంప్రదిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇలాగే పర్యాటకుల తాకిడి ఉంటే లక్షద్వీప్ మరిన్ని క్రూయిజ్ షిప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
జనవరిలో నరేంద్రమోదీ లక్షద్వీప్ను సందర్శించి ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు.
Modi
లక్షద్వీప్ అందాలు మంత్రముగ్దుడిని చేశాయి: మోదీ
ఆ ఫొటోల కింద లక్షద్వీప్ లోని ప్రకృతి రమణీయ దృశ్యాలు తనను కట్టిపడేశాయని, తనను మంత్రముగ్దుడిని చేశాయని పోస్ట్ చేశారు.
ఇంకా సాహసాలు చేయాలనుకునే వారు తమ జాబితాలో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవచ్చని సూచించారు.
దీంతో అంతర్జాతీయ పర్యాటకుల్లో లక్షద్వీప్ సందర్శన పట్ల ఆసక్తి పెరిగింది.
ఈ మేరకు తమను ఆన్ లైన్ ద్వారా విదేశీ పర్యాటకులు సంప్రదిస్తున్నారని తెలిపారు.