LOADING...
AP HC Recruitment 2026 : ఏపీ హైకోర్టులో భారీ నోటిఫికేషన్.. ఈనెల 30 నుంచి దరఖాస్తులు
ఏపీ హైకోర్టులో భారీ నోటిఫికేషన్.. ఈనెల 30 నుంచి దరఖాస్తులు

AP HC Recruitment 2026 : ఏపీ హైకోర్టులో భారీ నోటిఫికేషన్.. ఈనెల 30 నుంచి దరఖాస్తులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, ఎగ్జామినర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా అసిస్టెంట్ పోస్టులు 78 ఉండడం గమనార్హం.

వివరాలు

దరఖాస్తుల తేదీలు

ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 30 నుంచి ప్రారంభం కానుంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ [https://aphc.gov.in/index.php](https://aphc.gov.in/index.php) ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలని సూచించారు.

వివరాలు

అర్హతలు, ఎంపిక విధానం

పోస్టులను అనుసరించి విద్యా అర్హతలు నిర్ణయించారు. కొన్ని పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణత సరిపోతే, మరికొన్నింటికి డిగ్రీ, ఇంజినీరింగ్ లేదా లా అర్హత అవసరం ఉంటుంది. టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ వంటి పోస్టులకు టైపింగ్, షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ స్కిల్స్ తప్పనిసరి. ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉండగా, 90 నిమిషాల సమయం కేటాయించారు.

Advertisement

వివరాలు

వయోపరిమితి, ఫీజు

01-01-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400గా నిర్ణయించారు.

Advertisement

వివరాలు

పోస్టుల వివరాలు

సెక్షన్ ఆఫీసర్ - 5 సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ - 1 కంప్యూటర్ ఆపరేటర్ - 31 అసిస్టెంట్ లైబ్రేరియన్ - 1 లైబ్రేరియన్ గ్రేడ్-II - 1 యూడీ స్టెనోగ్రాఫర్ - 7 అసిస్టెంట్ - 78 ఎగ్జామినర్ - 27 టైపిస్ట్ - 44 కాపీయిస్ట్ - 34 డేటా ఎంట్రీ ఆపరేటర్ - 50 స్టెనోగ్రాఫర్ - 1 ఆఫీస్ సబార్డినేట్ - 20 మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు లభించనున్నాయి.

Advertisement