Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన.. 7,340 ఇళ్లకు 35,125 దరఖాస్తులు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ 'క్యూర్' పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం వరకు మొత్తం 35,125 దరఖాస్తులందినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతమ్ తెలిపారు. 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న మొత్తం 7,340 ఇళ్లకు ఈ నెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆగస్టు 20న లాటరీ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు ఏడాదిలోపు ఇళ్లను నిర్మించి అందజేస్తామని పేర్కొన్నారు. ఇళ్ల కేటాయింపు జరగని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ.10 వేల ధరావతు ఫీజును తిరిగి చెల్లిస్తామని గౌతమ్ స్పష్టం చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే 040-24603572 ఫోన్ నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.
వివరాలు
కూకట్‌పల్లిలో అత్యధిక దరఖాస్తులు
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తుల్లో కూకట్‌పల్లి మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ అత్యధికంగా 5,233 దరఖాస్తులొచ్చాయి.
ఇతర నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఖైరతాబాద్: 4,394
కుత్బుల్లాపూర్: 4,121
నాంపల్లి: 3,613
మలక్‌పేట: 2,846
శేరిలింగంపల్లి: 2,530
అంబర్‌పేట: 2,357
కార్వాన్: 1,574
రాజేంద్రనగర్: 1,496
సికింద్రాబాద్ కంటోన్మెంట్: 1,374
మేడ్చల్: 1,153
బహదూర్‌పుర: 1,135
సనత్‌నగర్: 1,046
మల్కాజిగిరి: 1,033
ఇబ్రహీంపట్నం: 749
మహేశ్వరం: 471
మొత్తంగా 7,340 ఇళ్ల కోసం 35,125 దరఖాస్తులు రావడంతో లబ్ధిదారుల ఎంపికలో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 20న నిర్వహించనున్న లాటరీతో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.