Loading...
Hyderabad Night Buses: హైదరాబాద్‌లో రాత్రంతా బస్సులు.. ఆరు రూట్లలో నైట్ సర్వీసులు ప్రారంభం
హైదరాబాద్‌లో రాత్రంతా బస్సులు.. ఆరు రూట్లలో నైట్ సర్వీసులు ప్రారంభం

Hyderabad Night Buses: హైదరాబాద్‌లో రాత్రంతా బస్సులు.. ఆరు రూట్లలో నైట్ సర్వీసులు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 01, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త అందించింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం (సెప్టెంబర్ 1) నుంచి నగరంలోని ఆరు ప్రధాన మార్గాల్లో నైట్ బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించింది. రాత్రి 10 లేదా 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. శ్రీధర్ ఈ విషయాలను వెల్లడించారు. ఐటీ కారిడార్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను అనుసంధానిస్తూ మొత్తం 15 బస్సులతో ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు.

వివరాలు 

ఐటీ, ఇతర రాత్రి షిఫ్ట్ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్ణయం

ప్రయాణికుల స్పందన, సర్వీసులకు పెరిగే డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో బస్సుల సంఖ్యను పెంచుతామని చెప్పారు.

గతంలో టీజీఎస్‌ఆర్టీసీ 'నైట్ రైడర్స్' పేరుతో రాత్రి బస్సు సర్వీసులను నిర్వహించింది.

అయితే ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆ సేవలను నిలిపివేసింది.

ప్రస్తుతం నగరంలో రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, ముఖ్యంగా ఐటీ, హాస్పిటాలిటీ రంగాల్లో పనిచేసే సిబ్బంది, విద్యార్థులు రాత్రి ప్రయాణాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వీసులను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

వివరాలు 

ప్రస్తుతం నడిచే ఆరు రూట్ల వివరాలు

222A: కోఠి నుంచి పటాన్‌చెరు (అబిడ్స్, లక్డీకాపూల్, కొండాపూర్ మీదుగా) - ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు

218: అఫ్జల్‌గంజ్/సీబీఎస్ నుంచి పటాన్‌చెరు (కోఠి, కేపీహెచ్‌బీ, మియాపూర్ మీదుగా)

219: సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు (ప్యారడైజ్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ మీదుగా)

290U: హయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్ (ఎల్‌బీ నగర్, నాగోల్, తార్నాక మీదుగా)

195W: బాచుపల్లి నుంచి వేవ్‌రాక్ (ఐటీ క్యాంపస్‌ల మీదుగా)

10H: కొండాపూర్ నుంచి సికింద్రాబాద్

ADVERTISEMENT

వివరాలు 

నైట్ బస్సులు సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సౌకర్యం 

రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఈ నైట్ బస్సులు సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సౌకర్యాన్ని అందిస్తాయని అధికారులు తెలిపారు.

యాప్ ఆధారిత క్యాబ్‌లపై ప్రయాణికులు ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించడం కూడా ఈ సర్వీసుల ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని స్పష్టం చేశారు.

నైట్ బస్సు సర్వీసులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 99592 26160 నంబర్‌లో సంప్రదించాలని టీజీఎస్‌ఆర్టీసీ సూచించింది.

ADVERTISEMENT