Loading...
IIM graduates family: పెళ్లి ఖర్చుల పేరుతో రూ.7 కోట్లు.. ఐఐఎం గ్రాడ్యుయేట్ కుటుంబంపై నెటిజన్ల సెటైర్లు
పెళ్లి ఖర్చుల పేరుతో రూ.7 కోట్లు.. ఐఐఎం గ్రాడ్యుయేట్ కుటుంబంపై నెటిజన్ల సెటైర్లు

IIM graduates family: పెళ్లి ఖర్చుల పేరుతో రూ.7 కోట్లు.. ఐఐఎం గ్రాడ్యుయేట్ కుటుంబంపై నెటిజన్ల సెటైర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెళ్లి సంబంధాల విషయంలో అబ్బాయి చదువు, ఉద్యోగం, జీతానికి ప్రాధాన్యం ఇవ్వడం సాధారణమే. అయితే ఈ అర్హతలను అడ్డుపెట్టుకుని కొన్ని కుటుంబాలు చేస్తున్న డిమాండ్లు హద్దులు దాటుతున్నాయి. తాజాగా ఐఐఎంలో చదువుకున్న ఓ యువకుడి కుటుంబం పెళ్లి ఖర్చుల పేరుతో ఏకంగా రూ.7 కోట్లు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మల్లికా అహ్లువాలియా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ అనుభవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు 

పెళ్లి ఖర్చుల కోసం రూ.7 కోట్లు డిమాండ్

తన స్నేహితురాలికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఈ చేదు అనుభవం ఎదురైందని మల్లికా అహ్లువాలియా వెల్లడించారు.

మ్యారేజ్ బ్రోకర్ ద్వారా ఐఐఎం గ్రాడ్యుయేట్ అయిన ఓ యువకుడి కుటుంబం సంబంధం కోసం ముందుకొచ్చిందని చెప్పారు.

అయితే పెళ్లి చర్చల సమయంలోనే ఆ కుటుంబం కనీసం రూ.7 కోట్లు ఖర్చు చేయాలని షరతు పెట్టిందని తెలిపారు.

ఈ డిమాండ్‌పై మల్లికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం డబ్బు గురించి మాత్రమే కాకుండా, అవతలి కుటుంబం నుంచి ఇలాంటి డిమాండ్లు చేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు.

దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో చదువుకున్న వ్యక్తి, ఆయన కుటుంబం ఇంత సంకుచితంగా ఆలోచించడం విడ్డూరమని విమర్శించారు.

వివరాలు 

పెళ్లి ఖర్చుల కోసం రూ.7 కోట్లు డిమాండ్

అంత గొప్ప డిగ్రీలు చదివి ఏం ప్రయోజనం? చదువుకున్నా ఆలోచనలు ఇంత వెనుకబడి ఉంటే ఎలా? అంటూ ఘాటుగా స్పందించారు.

తమ ముఖాలను అద్దంలో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. పెళ్లి సంబంధాల మార్కెట్‌లో పురుషులకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో కొందరు ఇలా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

అమ్మాయిల కుటుంబాలు కూడా ఇలాంటి డిమాండ్లకు ఎదురుతిరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని వ్యాఖ్యానించారు.

ఉన్నత విద్యావంతుడైన ఓ పురుషుడు తనకు సమానమైన అర్హతలు ఉన్న మహిళను జీవిత భాగస్వామిగా కోరుకోవడంలో తప్పు లేదని మల్లికా అన్నారు.

అయితే తన చదువును, ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని ఓ కుటుంబాన్ని ఆర్థికంగా పీల్చిపిప్పి చేయాలనుకోవడం మాత్రం సరికాదని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

నెటిజన్ల మధ్య వాదోపవాదాలు

ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కొందరు అమ్మాయిలు కూడా మంచి జీతాలు, భారీ ప్యాకేజీలు ఉన్న అబ్బాయిలనే కోరుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు.

ఆస్తులు ఎక్కువగా ఉన్నప్పుడే తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తామని అమ్మాయిల తల్లిదండ్రులు కూడా బేరసారాలు చేస్తున్నారని అంటున్నారు.

ఇలాంటి విషయాలను ఇరువైపుల వ్యక్తిగత ఎంపికలుగా చూడాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ వాదనపై మరో నెటిజన్ స్పందిస్తూ.. అమ్మాయి ఐఐఎం లేదా ఐఐటీలో చదివి, అబ్బాయి కంటే ఎక్కువ సంపాదిస్తే, పెళ్లి కోసం అబ్బాయి కుటుంబాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని డిమాండ్ చేయగలదా? అలా చేస్తే సమాజం అంగీకరిస్తుందా? అని ప్రశ్నించారు.

ADVERTISEMENT

వివరాలు 

కట్నం డిమాండ్లపై ఆందోళన

మరికొందరు ఐఐఎం గ్రాడ్యుయేట్ కుటుంబం రూ.7కోట్లు డిమాండ్ చేయడంపై వ్యంగ్యంగా స్పందించారు.

ఆ యువకుడు ఐఐఎంలో చదివింది విలువ పెంచుకోవడానికేనా? లేక సెకండ్‌హ్యాండ్ ఎయిర్‌బస్‌లా తనకు కోట్ల రూపాయల ధర నిర్ణయించుకోవడానికా? అంటూ ఎద్దేవా చేశారు.

భారతదేశంలో కట్నం అడగడం చట్టరీత్యా నేరమని,ఇలాంటి డిమాండ్లను వ్యక్తిగత ఎంపికగా సమర్థించడం సిగ్గుచేటని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

పెళ్లి సమయంలో డబ్బు కోసం చేసే వేధింపులు భవిష్యత్తులో మహిళల ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తంగా పెళ్లి సంబంధాల విషయంలో అబ్బాయిల కుటుంబాలు,అమ్మాయిల కుటుంబాలు చేస్తున్న భారీ డిమాండ్లపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

పెళ్లి పేరుతో ఆర్థిక బేరసారాలు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది.

ADVERTISEMENT