PM Modi: కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 02, 2026
11:53 am
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటన సమయంలో కాక్‌పిట్‌లో ఎదురైన అత్యవసర పరిస్థితి, తాను ఎదుర్కొన్న పరిణామాలను కెప్టెన్ స్మిత్ ప్రధానికి వివరించారు. విపత్కర పరిస్థితుల్లో కెప్టెన్ స్మిత్ చూపించిన ధైర్యసాహసాలను ప్రధాని మోదీ మరోసారి ప్రశంసించారు. క్లిష్ట సమయంలో ఆయన వ్యవహరించిన తీరును అభినందించారు. గాయాల నుంచి కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని మోదీ మాటామంతీ
PM Modi speaks to India's brave Flydubai pilot Captain Smit Machchaar, praises his bravery and wishes him quick recovery pic.twitter.com/3vMuXxDvgi
— WION (@WIONews) October 2, 2026