పుణెలో ఘోర ప్రమాదం: ఏడేళ్ల బాలుడిని ఈడ్చుకెళ్లిన కారు
మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటర్ మీద వెళ్తున్న ఏడేళ్ల బాలుడు, ఇంకా అతని తల్లిని ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూటర్‌ను వెనక నుంచి కారు డాష్ ఇవ్వడంతో ఆ బాలుడు కారు కిందకు వెళ్ళిపోయాడని, అలా దాదాపు 700 నుంచి 800మీటర్లు పాటు కారు లాక్కెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. కారు కింద బాలుడు ఇరుక్కుపోవడం చూసిన అక్కడి స్థానికులు అరుస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.
బాలుడు మృతి
ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని, అతని తల్లిని ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆ బాలుడు ప్రాణాలు వదిలేసాడు. అతని తల్లికి చికిత్స జరుగుతోంది. ప్రమదానికి కారణమైన కారు డ్రైవర్ రాహుల్ తాప్కి, మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలియజేసారు. ప్రస్తుతం డ్రైవర్ రాహుల్ తాప్కి (వయస్సు 40)ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసారు. పుణెలోని ఛరోలి పాటా ప్రాంతం దగ్గర స్కూటర్‌ను కార్ డాష్ ఇచ్చిందనీ, అక్కడి నుంచి 700మీటర్ల దూరం వరకు కార్ కింద ఇరుక్కుపోయి బాలుడు అలాగే ఉన్నాడని సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు.