Rajyasabha: రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలు
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఛైర్మన్ సభలో ప్రతిపక్షాన్ని తక్కువగా చూడడమే కాక, అధికారపక్షానికి మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి ఇండియా కూటమి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి, కానీ సభలు ప్రారంభమైనప్పటి నుంచి అదానీ లంచం వ్యవహారం ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి మధ్య తీవ్ర వివాదాలు సృష్టించడంతో సభలు అవధులతో ముందుకెళ్లడం కష్టంగా మారింది. ఇందుకోసం తరచుగా సమావేశాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.
సభలో జరిగిన పరిణామాలపై ధన్‌కర్ మల్లిఖార్జున ఖర్గే తో చర్చ
మరోవైపు, అధికారపక్షం సోనియా గాంధీ, జార్జ్ సోరోస్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేస్తోంది,ఇది సభలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో రాజ్యసభ ఛైర్మన్ ధన్‌కర్ అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాన్ని తక్కువగా చూస్తున్నారని ఇండియాకూటమి ఎంపీలు ఆరోపిస్తున్నారు. అందుకే, ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంపెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.ఈ అంశంపై ఇండియా కూటమి ఎంపీలంతా ఒకే దిశలో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో, రాజ్యసభలో అనివార్యమైన గందరగోళాన్నిబట్టి,ఛైర్మన్ ధన్‌కర్,సభా నాయకుడు జేపీ నడ్డా, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను తన ఛాంబర్‌కు రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో,సభలో జరిగిన పరిణామాలపై ధన్‌కర్ చర్చించబోతున్నారు. సభ సజావుగా నడపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై కూడా చర్చ జరగనుంది.