Page Loader
Janga Krishnamurthy: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్యెల్సీ జాంగా 
Janga Krishnamurthy: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్యెల్సీ జాంగా

Janga Krishnamurthy: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్యెల్సీ జాంగా 

వ్రాసిన వారు Stalin
Apr 01, 2024
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ కి బిగ్ షాక్ తగిలింది. పల్నాడు జిల్లా వైసీపీ ఎమ్యెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీకి రాజీనామా చేశారు.ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు తగిన న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఆదివారం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసిన విషయం తెలిసిందే. ఈ నెల 4 లేదా 5వ తేదీన టీడీపీలో చేరనున్నారు.గురజాల నియోజకవర్గం వైసీపీ టిక్కెట్ ను జంగా కృష్ణమూర్తి ఆశించారు. కానీ వైసీపీ అధినాయకత్వం ఇవ్వలేదు. దీంతో నిన్న బాపట్లకు వచ్చిన చంద్రబాబును కలిసిన జంగా తన రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. అందుకే ఈరోజు రాజీనామా చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజీనామా చేసిన జంగా