తదుపరి వార్తా కథనం

KCR: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
వ్రాసిన వారు
Stalin
Dec 09, 2023
10:39 am
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన బీఆర్ఎస్ శాసనసభపక్ష భేటీలో కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్న నేఫథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేసీఆర్ మినహా మితగా 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
గాయపడ్డ కేసీఆర్‌కు శుక్రవారం తుంటి ఎముక చికిత్స జరిగిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేసీఆర్ కోలుకునేందుకు మరో నాలుగు వారాలు పట్టొచ్చని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీఆర్ఎస్ ఏకగ్రీవ తీర్మానం
బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ pic.twitter.com/lLVTvNbrKH
— Telugu Scribe (@TeluguScribe) December 9, 2023