Page Loader
Aravind Kejriwal: కేజ్రీవాల్ కు జైలులో మొదటి ఇన్సులిన్ .. భారీగా పెరిగిన షుగర్ లెవల్స్
తిహార్​ జైలులో ఉన్న అరవింద్​ కేజ్రీవాల్​...చక్కెర స్థాయిలను చూపిస్తున్న గ్లూకోమీటర్

Aravind Kejriwal: కేజ్రీవాల్ కు జైలులో మొదటి ఇన్సులిన్ .. భారీగా పెరిగిన షుగర్ లెవల్స్

వ్రాసిన వారు Stalin
Apr 23, 2024
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam)లో అరెస్టయి తీహార్ జైలు (Tihar Jail)లో ఉంటున్నఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) కు ఇన్సులిన్ (insulin)ఇచ్చిన తర్వాత షుగర్ లెవెల్స్ భారీగా పెరిగాయి . టైప్ 2డయాబెటిస్ (Type 2 Diabetes) తో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత గ్లూకోమీటర్లో 320 చక్కర స్థాయిల రీడింగ్ చూపించింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) వెల్లడించింది. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తీహార్ జైలు సిబ్బంది తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ జైలు సూపరింటెండెంట్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Aravind Kejriwal-Insulin row

విచారణను తప్పించుకునేందుకే:  ఈడీ

జైలులో కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆ మరుసటి రోజే కేజ్రీవాల్ కు ఇన్సూలిన్ ఇచ్చిన తర్వాత ఆయన శరీరంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోయాయని ఆప్ చెప్పడం విశేషం. అయితే అరవింద్ కేజ్రీవాల్ కేవలం విచారణను తప్పించుకునేందుకే షుగర్ లెవల్ నాటకం ఆడుతున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది. అందుకే కేజ్రీవాల్ తిహార్ జైలులో మామిడి పండ్లు ఆలూ పూరి ఎక్కువగా తింటున్నారని ఈడి విమర్శించింది.