తదుపరి వార్తా కథనం
Atchutapuram: మత్స్యకారులకు వరించిన అదృష్టం.. ఆ 'కచిడి' చేపల ధర రూ. 1.40 లక్షలు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 13, 2025
11:10 am
ఈ వార్తాకథనం ఏంటి
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది.
ఆచ్యుతాపురం మండలంలోని పూడిమడక మత్స్యకారుల వలకు రెండు కచిడి చేపలు చిక్కాయి. ఇవి పండుగకు ఒక రోజు ముందే వచ్చినట్లు ఆనందం కలిగించాయి.
ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఈ చేపల విలువ రూ. 1.40 లక్షలు నమోదైంది. ఈ విలక్షణ చేపలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడినట్లు తెలుస్తోంది.
Details
కచిడి చేపలో ఔషద గుణాలు మెండు
పూడిమడకకు చెందిన వ్యాపారి ఈ చేపలను కొనుగోలు చేసి కోల్‌కతాకు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేశారు.
మగ కచిడి చేపలు బంగారు రంగులో మెరిసిపోతున్నాయని, అందువల్ల వీటిని గోల్డెన్ ఫిష్ అని పిలుస్తారు.
ఈ చేపలు చాలా రుచికరంగా ఉండడమే కాకుండా, అవి ఔషధ గుణాలతో కూడా నిండి ఉంటాయని మత్స్యకారులు పేర్కొన్నారు.