Page Loader
ORR: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పెను ప్రమాదం.. వరుసగా 9 కార్లు ఢీ
ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పెను ప్రమాదం.. వరుసగా 9 కార్లు ఢీ

ORR: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పెను ప్రమాదం.. వరుసగా 9 కార్లు ఢీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నమ్మ హోటల్‌ సమీపంలోని రాజేంద్రనగర్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటనలో వరుసగా తొమ్మిది కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పలు కార్లు పాక్షికంగా ధ్వంసమవ్వగా, ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడటం వల్ల పెనుప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణం ఓ కారు డ్రైవర్ వేగంతో అదుపుతప్పి సడన్ బ్రేక్ వేయడం. దీనితో వెనక నుంచి వస్తున్న కార్లు ఒక్కసారిగా కంట్రోల్ కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Details

రెండు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్

ఘటన స్థానంలో రెండు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. వెంటనే సమాచారం అందుకున్న ఔటర్‌ రింగ్‌ రోడ్ (ఓఆర్ఆర్‌) అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.