Manda Jannadham మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోగ్యం విషమం
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని వైద్యులు జగన్నాథం ను పరిశీలించిన తర్వాత, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, సోదరుడు మాజీ ఎంపీపీ వెంకట్ కుమార్, కుమారుడు శ్రీనాథ్ మరియు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.