
Amit shah: మావోయిస్టులు ఆయుధాలు వదలి లొంగిపోవాల్సిందే : అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
మావోయిస్టుల అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు వదిలి ప్రభుత్వ చర్చలకు ముందుకు వచ్చిన మావోయిస్టులను స్వాగతిస్తామన్నారు. ఈ విధంగా లొంగిపోయే వారందరికీ పునరావాసం, ఇతర రకాల ప్రయోజనాలు, సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బస్తర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో హోంమంత్రి వెల్లడించినట్లు, 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టుల నుంచి దేశం విముక్తమవుతుందని చెప్పారు. మావోయిస్టులు చర్చలు కోరుతున్నప్పటికీ, ఆయుధాలు వదిలి లొంగి వస్తేనే ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఆయుధాలతో శాంతిని భంగపరచే వ్యక్తులకు భద్రతా సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
Details
భవిష్యత్తులో మరిన్ని నిధులు
చర్చలకు ముందుకు రాకుండా, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్చి 31, 2026 తర్వాత, ఆ ప్రాంతాల అభివృద్ధి మావోయిస్టుల అడ్డంకి లేకుండా కొనసాగుతుందని స్థానిక ప్రజలకు హామీ ఇుచ్చారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.