ఆ రెండు ప్రాంతాలు లేకుండా ఇండియా మ్యాప్ చూపించిన MotoGP: క్షమాపణలు కోరిన సంస్థ
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ఫ్రీక్స్ ప్రారంభమైంది. మోటార్ సైకిల్ రోడ్ రేస్ ఈవెంట్లను నిర్వహించే MotoGP ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ప్రాక్టీస్ సెక్షన్స్ ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న మోటో జిపి భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చూపించింది. దీంతో ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలు లేకుండా భారతదేశ మ్యాపును చూపించినందుకు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో MotoGP క్షమాపణలు కోరింది. భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చూపించడం తమ ఉద్దేశ్యం కాదని, పొరపాటు వల్ల అలా జరిగిందని, అందుకు క్షమించమని కోరింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.