
Congress: కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్.. బీఆర్ఎస్‌కు భారీ షాక్
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్‌ఎస్‌ను వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది.
ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్సీ వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు.
సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్‌ను బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, చేవేళ్ల ఎంపీ టికెట్‌ను తిరిగి రంజిత్ రెడ్డికి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించడాన్ని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరికొంత మంది కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్‌లో చేరుతున్న దానం, రంజిత్ రెడ్డి
ముఖ్యమంత్రి, టిపిసిసి అద్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల బీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు.#JoiningsInCongress pic.twitter.com/4hPJhvYT0k
— Telangana Congress (@INCTelangana) March 17, 2024