Page Loader
Pm modi: ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. 34 ఏళ్ల మహిళ అరెస్ట్
ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. 34 ఏళ్ల మహిళ అరెస్ట్

Pm modi: ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. 34 ఏళ్ల మహిళ అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2024
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఒక మహిళ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం అందింది. ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ఈ బెదిరింపు కాల్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. గురువారం రోజున ముంబయి ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు ఒక బెదిరింపు కాల్‌ అందింది. ఆ కాల్‌లో,ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు దుండగులు పేర్కొన్నారు. అందుకు ఒక ఆయుధాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీనితో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కాల్‌ ఐడెంటిఫై చేసిన తర్వాత, ఆ కాల్‌ను ఓ 34 ఏళ్ల మహిళ చేసినట్లు గుర్తించారు. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబయి ట్రాఫిక్‌ పోలీసు కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌