తదుపరి వార్తా కథనం
Nara lokesh: మహా కుంభమేళాలో పుణ్య స్నానమాచరించిన నారా లోకేశ్ ఫ్యామిలీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 17, 2025
03:43 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహాకుంభమేళాలో తన సతీమణితో కలిసి పవిత్ర స్నానం చేశారు.
" నిజమైన ఆశీర్వచనం లభించిందంటూ" 'ఎక్స్'లో పోస్టు షేర్ చేశారు.
అలాగే, ఈ సందర్భంగా తన కుమారుడితో కలిసి దిగిన సెల్ఫీని కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఇక, ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 1.36 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
ఈ గణాంకాలతో, ఇప్పటి వరకు మొత్తం 52.83 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించినట్లు అధికారికంగా ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నారా లోకేశ్ చేసిన ట్వీట్
Truly blessed! #MahaKumbhMela2025#MahaKumbh#Prayagraj pic.twitter.com/K4Xn6r6c0H
— Lokesh Nara (@naralokesh) February 17, 2025