Page Loader
ఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్‌లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
జమ్ముకశ్మీర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు

ఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్‌లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

వ్రాసిన వారు Stalin
Dec 23, 2022
06:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెర్రర్ ఫండింగ్‌‌తో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న వారి ఇళ్లపై శుక్రవారం జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. జమ్ముకశ్మీర్‌లోని దాదాపు 17 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో కొన్ని డిజిటల్ డివైజ్‌లు, సిమ్ కార్డులు సీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు. కుల్గామ్, పుల్వామా, అనంత్‌నాగ్, సోపోర్, జమ్ము జిల్లాల్లోని 17చోట్ల ఎన్‌ఐఏ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఎన్‌ఐఏ అధికారులతో పాటు స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ దాడుల్లో పాల్గొన్నారు.

ఏఎన్ఏ

కశ్మీరీ పండిట్ల, భద్రతా సిబ్బందిపై దాడులు

జమ్ముకశ్మీర్‌లో పండిట్లతోపాటు, భద్రాతా సిబ్బంది లక్ష్యంగా ఇటీవల దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో స్థానికుల సాయంతో ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. అందుకే అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. అంతేకాదు.. జమ్ములో కశ్మీరీ పండిట్ల, భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడుల విషయం తాజాగా పార్లమెంట్‌లో కూడా చర్చకు వచ్చింది. ఈ క్రమంలో ఈ దాడులను ఏఎన్ఏ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో జూన్‌ 21న జమ్ములో జరిగిన దాడిని సుమోటాగా తీసుకున్న ఎన్‌ఐఏ.. దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తోంది.