
Earthquake: నేపాల్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. దిల్లీలో ప్రకంపనలు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదైనట్లు నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. నేపాల్‌లో భూకంపం సంభవించిన నేపథ్యంలో దిల్లీలో ప్రకంపనలు వచ్చాయి.
నేపాల్ రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 55కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.
భూకంపం 13కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.
భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
అయితే భూకంపం కారణంగా దిల్లీలోని భూమి కొన్నిసెకన్ల పాటు కుదుపునకు లోనైంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్‌మెంట్(PDNA) ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో నేపాల్ 11వ స్థానంలో ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖాట్మాండుకు సమీపంలో భూకంపం
#BREAKING
— Khaleej Times (@khaleejtimes) October 22, 2023
Magnitude 6.1 earthquake strikes Nepalhttps://t.co/8L4wnnfK3Q